రేపటి మహాధర్నాకు తరలిరండి..
దళితులు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులకు పిలుపు
ప్రజాశక్తి -పలమనేరు: ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న మహా ధర్నాకుదళితలు, గిరిజనలు, వ్యవసాయ కార్మికులు తరలిరావాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నురి ఈశ్వర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు పిలుపు నిచ్చారు. బుధ వారం పట్టణంలోని పెట్రోల్ బంక్ నుంచి పెద్ద బజారు, జాబిలి విధి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నురు ఈశ్వర్, ఓబుల్ రాజు మాట్లాడుతూ... దళితుల ఆత్మగౌరవం, సంక్షేమం, ఉపాధి, దళితవడల అభివద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సమానత్వం, సామాజిక న్యాయమే ధ్యేయంగా చేపట్టిన దళిత రక్షణ బైక్ జాత నిర్వహించామన్నారు యాత్ర ముగిసిందన్నారు. దళితుల సమస్యల పరిష్కారానికి 29న విజయవాడ ధర్నా చౌక్ లో జరగనున్న మహాధర్నాకు దళితులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాకాల సుబ్రహ్మణ్యం, ఎం శివకుమార్ కెవిపిఎస్ ,వ్యవసాయ కార్యదర్శి సంఘం నాయకులు సోమశేఖర్, రాజా, జయంతి, వినోద్, నరసింహులు, రెడ్డప్ప ,సుధాకర్ పాల్గొన్నారు.










