ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణంలోని జగనన్న కాలనీలో ఆర్డీవో జగన్నాథం పార్థసారథి హౌసింగ్‌డే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఇందులో స్థానికంగా జగనన్న లే అవుట్లను పరిశీలిం చారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సూచిం చారు. నూతనంగా నిర్మాణాలు చేపట్టిన ఎస్‌టి కాలనీ గహాల నిర్మాణాలను సందర్శించి అధికారులకు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పనపై గహ నిర్మాణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తు న్నామన్నారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బేస్‌మెంట్ స్థాయి లోనే ఎగుడు దిగుడు లేకుండా క్రమ పద్ధతిలో సమాంత రంగా నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వహకులకు సూచించారు. రెండు పూటలా ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ వాటరింగ్ చేస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన బ్రిక్స్, ఐరన్, ఇసుక, సిమెంట్ కొరత లేకుండా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందు కు అధికారులు సచివాలయ సిబ్బంది కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణాలపై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డిఒ జగన్నాథం పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి విజయ సారథి, తహశీల్దారు మల్లికార్జునరావు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులు పాల్గొన్నారు.










