Sep 19,2023 22:51

ప్రజాశక్తి - బాపట్ల
బాపట్ల ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న జి శ్రీచరణ్ రేపల్లె తహసిల్దారుగా బదిలీ అయినట్టు తెలిసింది. బాపట్ల డిప్యూటీ తహసిల్దారుగా పనిచేస్తూ బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల తహసిల్దారుగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తాజాగా బాపట్ల ఆర్డిఓ కార్యాలయంలో అడ్మిని స్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై రేపల్లె తహసిల్దారుగా  బదిలీపై వెళ్తున్నారు.