Oct 14,2023 21:23

రైతులు, ప్రజల అభివృద్ధిని తెలుసుకుంటున్న స్పెయిన్‌ బృందం

          ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    మండల పరిధిలోని రేకులకుంట గ్రామాన్ని స్పెయిన్‌ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు స్పెయిన్‌ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఆర్డీటీ సంస్థ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా హార్టికల్చర్‌, బిందుసేద్యం, చెక్‌డ్యామ్‌ నిర్మాణాలు, పాడి పరిశ్రమ, అడవుల అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులను పరిశీలించి రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సదర్భంగా ఆర్‌డిటి చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి పురోగతి, సంస్థ ద్వారా ఆర్థిక స్వావలంబన పొందిన సభ్యుల ద్వారా స్వయాన స్పెయిన్‌ బృందం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ డైరెక్టర్‌ భీమలింగప్ప, ఎకాలజీ సెక్టార్‌ టీం లీడర్‌ నరసింహులు, ఎస్‌టిఒ వెంకటనారాయణ, సీడీసీలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.ఔ