Oct 06,2023 23:11

కలెక్టర్‌కు స్వాగతం పలుకుతున్న ఉద్యోగులు


ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ప్రభుత్వ సేవలకు సంబంధించిన పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకి చెబుదాం (1902) కార్యక్రమనికి విచ్చేసిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు, జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌, ఆర్‌డిఒ ప్రసన్నలక్ష్మికి వైసిపి సీనియర్‌ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్‌ రెడ్డి, ఎంపిపి రామినేని దేవి ప్రవణ్య స్వాగతం పలికారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోలగాని తిరుపతి రావు, మండల సచివాలయాల కన్వీనర్‌ ఉయ్యారు భరత్‌ కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ మల్లాది రాణి, వైస్‌ ఎంపిపి-1చాట్ల రాబర్ట్‌, వైస్‌ ఎంపిపి-2 పాటిబండ్ల శ్రీనివాస్‌రావు, ఎంపిటిసి సభ్యులు కుప్పిరెడ్డి వరప్రసాద్‌ రెడ్డి, పిఎసిఎస్‌ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, రామినేని వీరస్వామి నాయుడు, తహశీల్దార్‌ పాల్‌, ఎంపిడిఒ, విష్టు ప్రసాద్‌, జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.