ప్రజాశక్తి - ఏలూరు
సిపిఎం కుమ్మరి రేవు శాఖ సభ్యులు రెడ్డి శ్రీమన్నారాయణ (52) మృతికి నగర కమిటీ సంతాపం తెలిపింది. సోమవారం ఉదయం స్థానిక 29వ డివిజన్ కుమ్మరి రేవులో మృతదేహాన్ని సిపిఎం జిల్లా, నగర నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు బి.సోమయ్య మాట్లాడుతూ శ్రీమన్నారాయణ బిల్డింగ్ కార్మికుడిగా పని చేస్తూ అటు సిఐటియు, ఇటు సిపిఎం కార్యకలాపాల్లో పాల్గొనేవారన్నారు. శ్రీమన్నారాయణకు, భార్య, ఒక కుమార్తె ఉన్నారన్నారు. శ్రీమన్నారాయణ మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీమన్నారాయణ మృతదేహంపై ఏలూరు కార్యదర్శి పళ్లెం కిషోర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్ పార్టీ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి జి.యేసుబాబు, నాయకులు జగన్నాధరావు, మీసాల సత్యం, ఇజ్జడ దుర్గారావు, సుదర్శన్, మాణిక్యాలరావు, శంకర్ పాల్గొన్నారు. రెడ్డి శ్రీమన్నారాయణ మృతికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.










