
ప్రజాశక్తి-గన్నవరం : ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే ప్రజా రక్షణ బేరి యాత్ర బహిరంగ సభ, ర్యాలీలో ముందు పీటన మార్చి ఫాస్ట్‌లో నడిచేందుకు రెడ్ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఆదివారం గన్నవరంలో జరిగింది. గన్నవరం, చనుపల్లె వారి గూడెం,ఉయ్యూరు, ఉంగుటూరు, పెనమలూరు గ్రామాల నుంచి యువకులు గన్నవరం వచ్చారు. వీరిలో మహిళా యువతులు కూడా ఉండడం విశేషం. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పవన్, సమరం లు శిక్షణ ఇస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి నరసింహారావు శిబిరాన్ని పరివేక్షిస్తున్నారు. 15వ తేదీన జరిగే ర్యాలీలో వీరు పాల్గొంటారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా వీరిని తయారు చేయడం జరుగుతుందని పవన్ తెలిపారు.