చెక్కు అందజేస్తున్న దాత
రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి రూ.5 లక్షల విరాళం
ప్రజాశక్తి-నెల్లూరు:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా శాఖ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ది కోసం వినియోగించుకొనేందుకు రూ. 5 (ఐదు) లక్షలను విరాళంగా కీ.శే నాతా సీతయ్య, నాతా రోశమ్మ పేరు మీద వారి కుమారుడు నాతా సుధాకర్ రావు, కోడలు నాతా విజయకుమారి అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విరాళానికి సంబంధించిన చెక్కును దాతలు కలెక్టర్ యం హరినారాయణన్ చేతుల మీదుగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యం. నాగేశ్వర రావు అందచేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు యాలమూరి రంగారావు, రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు జలదంకి సుబ్బారావు, కనుమూరు సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.










