ప్రజాశక్తి-బాపట్ల: కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగిల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించిన 1848 ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డేగా పరిగణిస్తున్నట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం రెడ్ బుక్ డే సందర్భంగా బాపట్ల పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు నిర్వహించిన రెడ్ బుక్ డేను సిపిఎం సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు ప్రారంభించారు. కృష్ణమోహన్ మాట్లాడుతూ రెడ్ బుక్స్ అధ్యయనం సమాజ మార్పునకు సాధనమని అన్నారు.
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానంలో..
సమాజంలో జరుగుతున్న దోపిడీని, సామాజిక రుగ్మతను కళ్ళకు కట్టినట్టుగా చూపించారని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కార్మికవర్గం బిజెపి ఉచ్చులో చిక్కుకోకుండా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఐక్యంగా పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా మ్యాజిక్ ప్రోగ్రాం చేసి చూపించారు. పుస్తకాలు చదవడం ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు. అధ్యయనం సమాజ మార్పునకు ఒక సాధనమని, పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వీలవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎం ఆర్య, టి సుభాషిణి, షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.
సంతనూతలపాడు రూరల్: సమాజంలో దోపిడీకి గురవుతున్న రైతులు కార్మికులు శ్రమజీవులు పేదల గురించి వారి బాధల గురించి సాహిత్య రూపంలో సమాజం ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మహాకవి శ్రీశ్రీ అని సిపిఎం సీనియర్ నాయకులు ఏవి పుల్లారావు పేర్కొన్నారు. రెడ్ బుక్ డే సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం సంతనూతలపాడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీశ్రీ మహాప్రస్థానం గురించి వివరించారు. పుల్లారావు మాట్లాడుతూ శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యం సమాజం ముందుకు వచ్చేనాటికి రాజులు, రాణులు, దోపిడీదారులు, మనువాదుల గురించిన సాహిత్యమే ప్రధానంగా ఉండేదని, సమాజంలో సాహిత్యం అంటే అదేనని నమ్మించారన్నారు. కారల్ మార్క్స్ చెప్పిన దోపిడీ రహిత సమాజం సోవియట్ రష్యాలో విజయవంతం అయిన విషయాన్ని ప్రజలందరూ ఆలోచించాలని ఆ వైపు చూడాలని శ్రీశ్రీ తన సాహిత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. శ్రీశ్రీ సాహిత్యం ఇప్పటికీ నిత్య నూతన యవ్వనంగా ఉంటుందని సమాజంలో జరుగుతున్న దోపిడీ పరిస్థితులను వివరిస్తుందన్నారు. సమావేశానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జే జయంతిబాబు అధ్యక్షులు వహించగా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కే మాబు, జిల్లా కమిటీ సభ్యులు కాలం సుబ్బారావు పూసపాటి వెంకటరావు, బంకా సుబ్బారావు, సీనియర్ నాయకులు పమిడి వెంకట్రావు, నెరుసుల వెంకటేశ్వర్లు, ఉబ్బా ఆదిలక్ష్మి, కిలారి పెద్దబ్బాయి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.










