ప్రజాశక్తి - ఆగిరిపల్లి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి రధసారధులు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి క్షుణ్నంగా వివరించాలని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. సోమవారం ఆగిరిపల్లిలోని పొన్నం కళ్యాణ మండపంలో మండలంలో నూతనంగా నియమించిన రధసారధులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.అనూష, జెడ్‌పిటిసి సభ్యులు పి.వీరబాబు, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రధసారధులు పాల్గొన్నారు.










