Oct 22,2023 18:41

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
            రచ్చబండ తీర్పులకు చట్ట భద్రత కల్పించుకోవాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ న్యాయవాది కామన మునిస్వామి అన్నారు. తణుకులో శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రంలో ప్రజలకు ఆదివారం ఉచిత న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లా డుతూ గ్రామాల్లో రచ్చబండల వద్ద జరిగిన రాజీలన్నిటికీ లోక్‌ అదాలత్‌ ద్వారా చట్టభద్రత కల్పించుకోవాలన్నారు. స్థిరాస్తి కలిగి ఉన్న వ్యక్తి ప్రాణభయం ఉంటే వెంటనే పోలీసులకు ఇవ్వాలన్నారు. ఎవరైతే భయపెడుతున్నారో ఆ వ్యక్తులను పోలీసు అధికారులు పిలిపించి విచారణ జరిపి ఎటువంటి ప్రాణహాని ఉండకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు చట్టపరంగా ఉండవని తెలిపారు. ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.