Jul 28,2023 23:05

శంకుస్థాపన చేస్తున్న నేతలు

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని హుకుంపేట పంచాయతీ దిగుడుపుట్టులో రచ్చబండ నిర్మాణంకు ఎంపీపీ కూడా రాజుబాబు, జడ్పీటీసీ రేగం మత్స్యలింగంలు శుక్రవారం శంకుస్థాపన చేపట్టారు. అనంతరం జడ్పీటీసీ రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, పంచాయతీ పలు సమస్యలను చర్చించేందుకు రచ్చబండ ఎంతో అవసరం అని అన్నారు.అనంతరం స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో మధ్యాహ్న బోజక పధకం, తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు ముత్యాంగి విశ్వేశ్వరరావు, వైస్సార్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నైని సత్తిబాబు, సర్పంచ్‌ సమిడ వెంకటాపూర్ణిమ, నాయకులు పాంగి అనిల్‌, సూరిబాబు, అప్పన్న పాల్గొన్నారు.