Oct 21,2023 20:30

చాగంటివారిపాలెంలో మాట్లాడుతున్న పోరుయాత్ర బృందం

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుయాత్ర ఏడో రోజుకు చేరింది. శుక్రవారం యాత్ర ముప్పాళ్ల, చాగంటివారిపాలెం గ్రామాల్లో కొనసాగింది. ఆయా గ్రామాల్లో స్థానికులను నాయకులు కలిసి సమస్యలను తెలుసుకోగా పలువురు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడుతూ కనీసం రబీ పంటలకైనా సాగునీరు విడుదల చేస్తే మొక్కజొన్న రైతులు గట్టెక్కుతారని అన్నారు. ముప్పాళ్ల పోలీసుస్టేషన్‌ వెనుక నుండి రైతులు పొలాలకు వెళ్లే డొంక వర్షాలు పడితే ఆధ్వానంగా మారుతోందని, గ్రావెల్‌ పోయాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో జి.జాలయ్య, కె.సాంబశివరావు, కె.ప్రభాకర్‌, ఎన్‌.సాంబశివరావు, ఐ.లింగ య్య, శ్రీను, ఎం.వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు, పి.సైదాఖాన్‌, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, టి.బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.