రైతును వ్యాపారస్తుడిని చేయడమేఆర్ఎం కిసాన్ ధ్యేయం- అధునాతన పరికరాలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు
- ఆర్‌ఎం కిసాన్ సెంటర్ వ్యవస్థాపకులు రాజశేఖర్‌రెడ్డి
కమలాపురం
ప్రతి రైతునూ వ్యాపారస్తుడిని చేయడమే ఆర్‌ఎం కిసాన్ ధ్యేయమని ఆర్‌ఎం కిసాన్ సెంటర్ వ్యవస్థాపకులు రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజ కవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం ఎన్.పాలగిరి గ్రామంలో ఆదివారం ఆర్‌ఎం కిసాన్ సెంటర్‌ను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్సీసీ ఛైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ సలహాదారుడు తిరుపాల్ రెడ్డి, ఆర్టికల్చర్ సలహాదారుడు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట ప్రతిభ బయోటెక్ సంస్థను స్థాపించి 60 మంది ఉద్యోగులతో వ్యవసాయాధారిత ఉత్పత్తులను రైతులకు అందిస్తూ నేడు ఈ స్థాయికి చేరామని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 700 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. అధునాతన పరికరాలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఇక్కడ అందుబాటులో ఉందని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ పొలాలకు సంబందించిన మట్టి, నీరు, ఎరువులు ఆయా భూములకు సరిపడే విధంగా పరీక్షలు చేసి సలహాలు ఇస్తారని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా ప్రతి శనివారమూ వంద మంది రైతులకు అన్ని వసతులు కల్పిస్తూ భోజన వసతి కూడా ఏర్పాటు చేసి వ్యవసాయంపై అధునాతన విధానాలు, ఏయే పంటలకు ఏవేవి అవసరం ఏవిధంగా అత్యధిక లాభాలు పొందవచ్చో అనే అంశాలపై తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సంస్థకు అడిగిన వెంటనే సర్వరాయ సాగర్ నుంచి నీటిని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో భారత్ బయోటెక్ పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. కరువు ప్రాంతమైన ఇక్కడ ఈ పరిశ్రమ రావడంతో రైతులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రైతుల కోసం ఏర్పాటుచేసిన సంస్థను ఉపయోగించుకుని మంచి ఫలితాలు పొందాలని తెలియజేశారు.కి










