
వినుకొండ: రాష్ట్రంలో సాగుతున్న రైతు వ్యతిరేక పాలనతో నేడు రాష్ట్రమంతా రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తీవ్ర వర్షాభావం కరువుతో ఎండిపోయిన పంటలను వినుకొండ మండలం చీకటిగలపాలెం మేజర్ ఆయకట్టు పరిధిలో టిడిపి నేతలు పరిశీలించి నష్టపోయిన రైతులను పరా మర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 470 మండలాల్లో కరువు వస్తే రైతు వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వం 103 మండలాల్లో కరువుగా ప్రకటించి వాటిలో 23 మండలాల్లో కరువు తీవ్రత ఉన్నట్లు గుర్తించడం దారు ణం అన్నారు. ఆరుతడికి నీరు ఇస్తామని నోటిపారుదల మంత్రి చేసిన ప్రకటనతో నమ్మి రైతులు పంట సాగు చేసి తీవ్ర వర్షాభావం తో ఎకరాకు లక్ష నుండి లక్షన్నర వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి నష్టపోయిన మిరప, పత్తి రైతుకు ఎకరాకు 50 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని, ఆరుతడికి నీటి ట్రాన్స్‌పోర్ట్‌పై రాయితీ ప్రకటించి ఆదు కోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు మాట్లాడుతూ ఆరు తడికి సాగునీరు ఇసా ్తమని ప్రకటించి నీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచిన మంత్రి అంబటి రాంబాబుకు మంత్రిగా సాగే నైతిక హక్కు లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో తీవ్రంగా కరువు తాండవిస్తుంటే కరువు మండలాలుగా ప్రకటించిన వాటి జాబితాలో పల్నాడు లోని ఒక మండలం కూడా లేకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఉన్న పంటలను కాపాడేందుకు సాగర్ జలాలను విడుదల చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లబెల్లి రామకృష్ణారెడ్డి,జిల్లా టిడిపి రైతు కమిటి నాయకులు సాంబిరెడ్డి వినుకొండ మండల పార్టీ అధ్యక్షుడు మాదినేని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట: వైసిపి ప్రభుత్వం వ్యవసాయం, రైతులు, నీటి పారుదల శాఖను పూర్గిఆ గాలి కొదిలేసిందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్థానిక పండరీ పురంలోని టిడిపి కార్యాల యంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు ప్రభావిత ప్రాంతాల్లో రైతుల దుస్థితి చూస్తే కడుపు తరు క్కు పోతోందన్నారు. సకాలంలో వర్షాలు లేక , అక్కడక్కడా ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వం విడుదల చేయక పంటలన్నీ నిలువునా ఎండిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకోవాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. పల్నాడు జిల్లా విను కొండ ప్రాంతంలో కనీసం ట్యాంకర్ల ద్వారా అయిన పంటల్ని కాపాడుకోవడానికి రైతులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందుకు ఒక తడికి రూ.10 వేల వరకు ఖర్చు అవుతోందని, ప్రభుత్వం కనీసం ఆ ట్యాంకర్ల ఖర్చు కోసమైనా రాయితీ ఇస్తే పంటలు బతుకుతాయని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు.