Aug 17,2023 00:13

కేతిముక్కల అగ్రహారంలో పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

పల్నాడు జిల్లా: వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు,సూచనలు పాటించి వ్యవసాయాన్ని లాభ సాటిగా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ. మురళి అన్నారు. నరస రావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రం పరిధిలో గల కేతిముక్కల అగ్రహారం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పత్తి ,సోయాబీన్‌ పంటలను బుధవారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరియు గుంటూరు లాం ఫారం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త ఎం. సుధారాణి , పల్నాడు జిల్లా డిఏఏటిటి సెంటర్‌ శాస్త్రవేత్త జి.రమేష్‌, ఎఫ్‌.టి.సి డిడిఏ ఎం.శివ కుమారి, నరసరావు పేట ఏడిఏ పి.మస్తానమ్మ,రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఎం. సుధారాణి పత్తి పంట లో తామర పురుగు,రసం పీల్చే పురుగులు ఉన్నట్టు గుర్తించారు. నివారణకు పసుపురంగు,నీలి రంగు జిగురు అట్టలను పొలంలో ఉంచాలని సూచించారు. తామర పురుగు ఉధ్రుతి ఎక్కువగా ఉన్నట్లయితే నివా రణకు రీజెంట్‌ 2 ఎం.ఎల్‌ ఒక లీటరు నీటికి లేదా వేప నూనె 1500 పిపిఎం 5 ఎం.ఎల్‌ ఒక లీటరు నీటికి పిచికారీ చేయాలని సూచించారు. గులాబీ రంగు పురుగు ఉధ్రుతిని అరికట్టేందుకు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 నుండి 15 వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. పొలం చుట్టూ పరిసరాలలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవా లన్నారు. సోయాబీన్‌ లో తల మాడు ఉన్నట్లు గుర్తించి నివారణకు రీజెంట్‌ 2 ఎం.ఎల్‌ ఒక లీటరు నీటికి , లేదా అసెటమిప్రిడ్‌ ఒక లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేతిముక్కల అగ్రహారం సర్పంచ్‌ దరువూరి బాబు, ఏ.ఈ.ఓ కె.బ్రహ్మయ్య, గ్రామ వ్యవసాయ సహాయకులు పి.పవన్‌ కుమార్‌, నాగరాజు నాయక్‌ రైతులు పాల్గొన్నారు.