Oct 11,2023 20:33

ప్రజాశక్తి - ముదినేపల్లి
  మండలంలోని రైతులు సార్వా, వరి సాగులో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని మండవల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు జి.వెంకటమణి తెలిపారు. మండలంలోని వడాలి, పెయ్యేరు గ్రామాల్లో బుధవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో వరిలో సమగ్ర సస్యరక్షణపై రైతులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వరి పైరులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగం, యాజమాన్యం పద్ధతుల గురించి జి.వెంకటమణి రైతులకు వివరించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో పాము పొడ తెగులు గమనించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బొర్రా వేణుమాధవ్‌, పెయ్యరు, వడాలి రైతు భరోసా కేంద్రాల ఇన్‌ఛార్జిలు అజరు కుమార్‌, దివ్య, పైరెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.