రాయచోటి : రబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొం దించుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజాం సుకు మార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో సుకుమార్‌రెడ్డి అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ రబీలో తీవ్ర వర్షాభావం ఏర్పడిందన్నారు. వర్షాభావ కారణంచేత రైతులు వేరుశనగ, వరి సాగు చేయలేక పోయినందున వాటి ప్రత్యామ్నాయంగా పెసలు, అలసందలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగు చేయాలన్నారు. వేరుశనగ పంట డిసెంబర్ 30వ తేదీ వరకు విత్తుకునే అవకాశం ఉందని కెవికె శాస్త్రవేత్త తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు వాటిని రైతులకు సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో యూరియా, డిఎపి, పొటా షియం, సూపర్ ఫాస్పేట్ కలిపి 15483 మెట్రిక్ టన్నుల ఎరువులు అందు బాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదని తెలిపారు. జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులందరూ వ్యవసాయ అభివద్ధికి కషి చేయా లన్నారు. 2023-24 రబీ సీజన్లో వ్యవసాయ ప్రణాళికను పక్కాగా అమలు చేసి రబీ సీజన్‌కి సంబంధించి విత్తనాలు, ఎరువుల సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆర్బికేల ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు అందించి జిల్లాలో వ్యవసాయం మరింత అభివద్ధి చెందే విధంగా చూడాలన్నారు. ఈ సందఠంగా రైతు భరోసా కేంద్రాలలో ఎరువుల లభ్యత తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. రైతుల కోసం సలహా మండలి సభ్యులు సమావేశం దష్టికి తీసుకువచ్చిన అంశాలన్ని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే సమావేశానికికల్లా పరిష్కరించాలని, అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి చంద్రనాయక్, జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ సభ్యులుహొ బోధషావలి, రవిరాజు, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.