మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే ద్వారా రైతులు నష్టపోకుండా, గొడవలు జరగకుండా సరిహద్దులు గుర్తించాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని 52 బసాపురం గ్రామంలో జరుగుతున్న రీసర్వేపై గ్రామ సర్వేయర్లు హరికృష్ణ, శేఖర్ నాయక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సర్వేయర్లు సర్వేపై గ్రామానికి చెందిన మ్యాప్‌ను ఎమ్మెల్యేకు చూపించి వివరించారు. రైతుల పొలాల సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి గొడవలకూ తావు లేకుండా సరిహద్దులను గుర్తించాలని ఎమ్మెల్యే సూచించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, సర్పంచి రాఘవరెడ్డి ఉన్నారు.










