Sep 12,2023 09:19

ఎడిసిసి బ్యాంకు నూతన భవాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, ఎడిసిసి బ్యాంకు ఛైర్‌పర్సన్‌

         కదిరి టౌన్‌ : ఎడిసిసి బ్యాంకు ద్వారా రైతులు, మహిళలకు విరివిగా రుణాలు అందజేస్తున్నట్లు ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎడిసిసి ఛైర్‌పర్సన్‌ లిఖిత పేర్కొన్నారు. కదిరి పట్టణం సైదాపురం ఆంజనేయస్వామి దేవస్థానం ఎదురుగా నూతనంగా నిర్మించిన ఎడిసిసి బ్యాంకు కార్యాలయ భవనాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంకు లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ద్వారా గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులు చిన్న, మధ్య తరహా వారిని ప్రోత్సహించే తక్కువ వడ్డీకి వివిధ రకాల రుణాలు సకాలంలో మంజూరు చేస్తున్నామన్నారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దశాబ్ధాల కాలం నుంచి రైతులకు సహకార కేంద్ర బ్యాంక్‌ మంచి సేవలు అందిస్తోందని తెలియజేశారు. బ్యాంకు ద్వారా రైతులకు అవసరమైన సబ్సిడీ రుణాలను కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ వడ్డీతో రునాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు బ్యాంకు సిబ్బంది, సొసైటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.