Feb 24,2023 23:59

మాట్లాడుతున్న రవిప్రకాష్‌

ప్రజాశక్తి -ఎస్‌.రాయవరం:ఈ పంట వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా ఈ నెల 28వ తేదీ లోపు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని ఎలమంచిలి సబ్‌ డివిజన్‌ సహాయ సంచాలకులు రవి ప్రకాష్‌ తెలిపారు. మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో పర్యటించిన ఆయన రైతు భరోసా కేంద్రం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు ఈ కేవైసీ నమోదుపై వరించాలన్నారు. రైతులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి సౌజన్య, రైతు భరోసా కేంద్రం సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.