Dec 09,2022 23:45

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం

ప్రజాశక్తి-దేవరాపల్లి
రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించాలని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ఎం.అలమండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎ గ్రేడు రకానికి క్వింటాకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 ధర ఇస్తున్నట్లు చెప్పారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో నగదు చెల్లింపు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పిటిసి కర్రి సత్యం, సర్పంచ్‌ దాడి జగన్‌, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, వైసిపి మండల అధ్యక్షులు బూరె బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.మోహనరావు, మండల ప్రత్యేక అధికారి రవీంద్రనాథ్‌, ఏవో కాంతమ్మ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.