Dec 01,2022 22:44

ప్రజాశక్తి-రెడ్డిగూడెం 

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు అన్నారు. రెడ్డిగూడెం, రంగాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వారి ధాన్యం విక్రయించాలన్నారు. 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1530లు, గ్రేడ్‌ ఏ రకపు ధాన్యానికి రూ.1545 లను కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒక క్వింటాకు (100కేజీలు) ధాన్యం సాధారణ రకానికి రూ.2040లు, గ్రేడ్‌ ఏ రకపు ధాన్యానికి రూ.2060 లను కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో వుండి సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం అన్నేరావుపేటలో వైఎస్‌ఆర్‌ జలసిరి పథకం కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించే పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.