ప్రజాశక్తి-రాజవొమ్మంగి
రైతులు దళారీలను నమ్మి మోసపోవద్దని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని జడ్డంగి రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఎరువులు అందజేసినట్లు చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారీలకు, ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయించి మోసాలకు గరికావద్దని హితవుపలికారు. అనంతరం రాజవొమ్మంగిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి 99 క్వార్టర్స్ రహదారి చివరివరకు రూ.20 లక్షలు ఎంపిపి నిధులతో మంజూరైన 400 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆమె భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పిటీసీ ఒడుగుల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, జడ్డంగి, రాజవొమ్మంగి సర్పంచులు కొంగర మురళీకృష్ణ, గొల్లపూడి రమణి, వైస్ ఎంపీపీలు సిహెచ్ సత్య చంద్రరాణి, జుర్రా రాజేశ్వరి, ఎంపిటిసి కనిగిరి దుర్గా, కో ఆప్షన్ సభ్యులు కామేష్, వైసీపి నాయకులు డి నాగు, ఎం గణలక్మి, సిహెచ్ శివ, బి వెంకటరమణ పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి ఎస్సై టీజీ నరేంద్ర ప్రసాద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.










