
రాయచోటి : రైతులు అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయాధికారులు కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకు మార్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి బోర్డు చైర్మన్ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి, నీటి పారుదల సలహా మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ కష్ణమూర్తి, వ్యవసాయ సలహా మండల సభ్యులు బోడే షావలి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ రైతు బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయాభివద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తుందన్నారు. ఈ దిశగా అధికారులందరూ పనిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఎరువులు మార్కెట్ ధర కంటే ఆర్ బికెలలో తక్కువ ధరకు అమ్మేటట్లు చూడాలన్నారు. పంట సాగుచేసిన రైతులందరూ తప్పకుండా ఈ పంట నమోదు చేసుకునేటట్లు చూడాలన్నారు. జిల్లాలో 1.78 లక్షల ఎకరాలలో ఈ పంట నమోదు చేయాల్సి ఉండగా 1.70 లక్షల ఎకరా లలో పంట నమోదు చేయడం చేశారని, కార్యక్ర మాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు 80 శాతం సబ్సిడీతో 1335 క్వింటాళ్ల ఉలవలు పంపిణీ చేశారని, అవసరమైన రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉలవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లా డుతూ జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ప్రస్తుత వర్షభావ పరిస్థితుల్లో ఇస్తున్న టువంటి ప్రత్యా మ్నాయ విత్తనాలతో చిరు ధాన్యాల సాగుకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. విత్తనాలు, పురుగు మందుల సమస్య తలతకుండా సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లేవనెత్తిన సమస్యలన్నీ అధికారులు నోట్ చేసుకొని వారం రోజుల లోపల తమకు ఆక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలన్నారు. జిల్లాలో ఈ పంట నమోదు, రైతుల బయోమెట్రిక్ అథెంటికేషన్ త్వరితగతన పూర్తయ్యేటట్టు చూడా లన్నారు. ఇ-పంట నమోదుకు సంబంధించి ఒక రైతు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా చూడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీటిపా రుదల శాఖ ఎస్‌ఇ కష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 8 రిజర్వాయర్లు, 3272 చెరువులు న్నాయ న్నారు. గత జులైలో వెలిగల్లు రిజర్వాయర్ నుంచి ఎడమ కుడి కాలువలకు 55 కిలోమీటర్ల వరకు నీరు విడుదల చేశామని చెప్పారు. దీంతో 30 చెరు వులకు నీరు నింపడం జరిగిందని, చెరువులకు నీరు నింపడం వల్ల బోరు బావులలో నీటిమట్టం చాలావరకు పెరిగిందన్నారు. చెరువు పక్కన ఉన్న గ్రామాలకు సాగు, తాగునీరు సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం చెరువులలో 25 శా తంకంటే నీరు తక్కువగా ఉందని రైతులు చిరుధాన్యాలు సాగు చేసి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.