Aug 17,2023 19:33

మాట్లాడుతున్న ఆర్‌డిఒ

మాట్లాడుతున్న ఆర్‌డిఒ
రైతులతో ఆర్‌డిఒ సమావేశం
ప్రజాశక్తి-దగదర్తి:దగదర్తి నుంచి చెన్నూరు మీదుగా బుచ్చికి వెళ్లే రోడ్డు విస్తీర్ణం భాగంగా భూ సేకరణ భూమి కోల్పోయిన రైతులతో కావలి ఆర్‌డిఒ శీను నాయక్‌ ప్రజా అభిప్రాయం సేకరణను చేపట్టారు. దీనిపై రైతులు మాట్లాడుతూ కోల్పోయిన భూమికి రేటు ఎంత ప్రకటిస్తారు తెలపాలని అడిగారు. దీనిపై స్పందించిన ఆర్‌డిఒ భూమి సేకరించిన తర్వాత రిజిస్టర్‌ ఆఫీస్‌ కి నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. పంపిన నివేదిక పైన రిజిస్టర్‌ రేటు నిర్ణయిస్తారని ఆ రేటు ప్రకారమే భూమి కోల్పోయిన రైతులకు పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ దగదర్తి-చెన్నూరు గ్రామాలకు సంబంధించి మొత్తం 2.77 సెంట్లు భూమిని సేకరిస్తున్నామని తెలిపారు.
దగదర్తి సంబంధించి 2.47 చెన్నూరుకు సంబంధించి 0.30 భూమిని తీసుకుంటున్నామన్నారు భూములు కోల్పోయిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు చేపడతామన్నారు. ఆన్లైన్లో పేరు నమోదు కాకుండా భూమి సాగు చేసుకుంటూ అగ్రిమెంట్‌ కొనుగోలు చేసి ఉన్న రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. రీ సర్వే చేపట్టి నప్పుడు పేరు నమోదు చేపడతారన్నారు. అందువలన ప్రతి రైతుకు పరిహారం అందుతుందని తెలిపారు.కార్యక్రమంలో తహశీల్దార్‌ చెంచయ్య, రైతులు పాల్గొన్నారు.