ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
ఖరీఫ్ ప్రారంభమైనప్పటికి వర్షాలు లేక తీవ్ర ఎండలకు భయపడుతున్న రైతన్నలకు ఆదివారం కురిసిన వర్షం రైతుల్లో ఆశలు నింపింది. ఒక వైపు ప్రాజెక్టుల్లో నీరు లేక మరో వైపు తీవ్ర ఎండలతో పొలాలు నెర్రెలు బారాయి. నీటి కోసం ఎదురు చూస్తున్నాయిఇ. పదును కోసం బిక్కు బిక్కు మంటూ చూస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం కురిసిన వర్షంతో పంట పొలాలు తడిసి ముద్దయ్యాయి. ఏ పంటలు వేయాలా అని ఆలోచిస్తున్న రైతులకు వర్షం ఊపిరి పోసింది. పర్చూరు - ఇంకొల్లు మధ్య పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. పాటికే పర్చూరు ప్రాంతంలో రైతులు ప్రత్తి సాగు చేశారు. మిర్చి సాగు చేయాలంటే రైతులు ఖర్చులకు వెనకాడుతున్నారు. వర్షాలపై ఆధారపడి నీరు లేక మిర్చి సాగు చేస్తే అప్పుల పాలవ్వక తప్పదనే ఆలోచనలో రైతులు ఉన్నారు. మినుము సాగు చేయాలనుకునే రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఈ వర్షం ఆనందం నిపించిది. మండలంలో 6వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.










