ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ అకా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిడిపి ఆధ్వర్యాన గురువారం ర్య్లాఈ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మాజీ ఎంఎల్‌ఎలు ఎస్‌విఎస్.వర్మ, జ్యోతుల నెహ్రూ, కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ ధర్నాచౌక్ వద్దకు ర్యాలీగా వెళుతుండగా ముందస్తుగా పోలీసులు ఇంద్రపాలెం జంక్షన్ వద్ద నాలుగు కూడళ్లు మూసివేశారు. దీంతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని టిడిపి నాయకులు కోరగా అందుకు పోలీసులు నిరాక రించడంతో పోలీసులను తోసుకుంటూ టిడిపి నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్లారు. టిడిపి నాయకులు బారికేడ్లను తొలగించుకుని కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జ్యోతుల నవీన్ కుమార్, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నవీన్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలకు 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, దెబ్బతిని రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారన్నారు.










