Aug 17,2023 19:40

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు

మాట్లాడుతున్న రైతు సంఘాల నాయకులు
రైతులను ముంచి రోడ్లు నిర్మించొద్దు
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:రైతులను ముంచి రోడ్లు నిర్మించొద్దని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలో భారత్‌ మాల సాగర్‌ మాల పేరుతో నిర్మించునున్న జాతీయ రహదారులలో భూములు కోల్పోతున్న మనుబోలు, వెంకటాచలం, పొదలకూరు, చేజర్ల మండలాల్లోని గ్రామాల రైతులను గురువారం కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో నిర్మించినటువంటి జాతీయ రహదారులకు రైతులకు నామమాత్రం నష్టపరిహారం చెల్లించి భూములు లాక్కోవడం బాధాకరమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా బహిరంగ మార్కెట్‌ విలువకు నాలుగు గంటలు కలిపి ఇవ్వాల్సి ఉందన్నారు.దానిని నామమాత్రంగా చెల్లించి రైతులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. సంవత్సరానికి రెండు పంటలు పండే సాగు భూములను రైతులు నోటికాడ నుంచి లాక్కొని సక్రంగా నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ల కడుపు కొట్టడం బాధాకరమన్నారు
. రైతులను, వ్యవసాయ కూలీలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వాలకు మంచి పద్ధతి కాదని తెలిపారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారి దగ్గర పాస్‌ పుస్తకాలు తీసుకొని వారికి సంబంధం లేకుండానే వాళ్ల అకౌంట్లో నామ మాత్రం నష్టపరిహారం చెల్లించడం దుర్మార్గమని అన్నారు. రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలని ఎనిమిది మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులందరూ ఈనెల 21వ తేదీన సోమవారం కలెక్టర్‌కు రాయబారం ఇవ్వడానికి రైతులందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులిగండ్ల శ్రీరాములు, మూలి వెంగయ్య, వ్య.కాస. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జొన్నలగడ్డ వెంకమరాజు, మంగళ పుల్లయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి పాల్గొన్నారు.