ప్రజాశక్తి-ఏలేశ్వరం రైతన్నలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన సోమవారం సేంద్రీయ వ్యవసాయం ద్వారా మైసూర్ మల్లిక, తైవాన్ బ్లాక్, కాలాబట్టి వరి వంగడాల నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల ప్రయోజనాలను వివరించారు. మనకు అన్నం పెట్టే రైతన్నను గౌరవించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కలిగిన ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీకి చెందిన 100 విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.










