ప్రజాశక్తి - పల్నాడు జిల్లా విలేకర్లు : వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లంఖింపూర్‌ఖేరీలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తున్న వారిపైకి జీపును నడిపి నలుగురి మృతికి కారణమైన కేంద్రమ మంత్రి అజరుకుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిత్రకు ఉరిశిక్ష వేయాలని, మంత్రిని బర్తరఫ్ చేయాలని రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చ, కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కార్మిక, రైతు సంఘాల, వామపక్షాల ఆధ్వర్యంలో బ్లాక్‌డే ప్రదర్శనలు నిర్వహిం చారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా రైతులపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికుల హక్కులను యాజమాన్యాలకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఢిల్లీ సరిహ ద్దుల్లో సుదీర్ఘంగా సాగిన పోరాటంలో 700 మంది రైతులు చనిపోయారని, ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్మిక, రైతు సంఘాల పైన పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో వివిధ సంఘాల నాయకులు సిలార్ మసూద్, సుభాష్ చంద్రబోస్, మస్తాన్‌వలి, రెడ్ బాష, బి.శ్రీనివాసరావు, యు.రంగయ్య, వి.వెంకట్, డి.వరహాలు, అంకమ్మరావు, రమణయ్య, మస్తాన్, పి.వెంకటేశ్వర్లు, మల్లికార్జున పాల్గొన్నారు. మండల కేంద్రమైన యడ్లపాడులోని జాతీయ రహదారి సెంటర్‌లో నిరసన తెలిపారు. కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ మాట్లాడారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగిం చేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని, దీన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఢిల్లీ ఉద్యమం విరమణ సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ టి.కోటేశ్వరరావు, రైతు నాయకులు జె.శంకరరావు, పి.పుల్లారావు, సిహెచ్ గురుస్వామి, డి.సాంబశివరావు, పి.సుబ్బారావు, ఎన్.కాళిదాసు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద డివైఎఫ్‌ఐ నాయకులు పి.మహేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక అరాచక పాలన సాగుతోందని, ప్రశ్నించిన వారిపై దాడులు అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ప్రధాని మోడీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజానీకంపై దాడులు ముమ్మరం చేశారని, అభ్యుదయ కవులు, మేధావులు, రచయితలు వంటి వారిపై కూడా దాడులు హత్యలు చేస్తున్నారని అన్నారు. ఈ విధానాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని, లేకుంటే రాబోయే కాలంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డి.విమల, జి.రజిని, జి.మల్లేశ్వరి, ఎ.వీరబ్రహ్మం, జి.బాలకృష్ణ, కె.శివదుర్గారావు, పి.సూర్య ప్రకాశరావు, షేక్ సాయిబా, సైదులు, ఎం.వెంకట నారాయణ, జె.రాజ్ కుమార్, పి.ప్రభాకర్, జి.సుసులోవ్, ఎ.ప్రసాదరావు, ఆర్.పురు షోత్తం, ఎం.హరిపోతురాజు పాల్గొన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని బ్యాంక్ సెంటర్ నుండి హైలాండ్ సెంటర్ వరకు భారీర్యాలీ చేశారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడారు. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు లను వెంటనే అమలు చేయాలని కోరారు. రైతు కూలీ సంఘం నాయకులు ఎన్.రాంబాబు మాట్లాడుతూ లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించారని, ఆ ఘటనలో ముగ్గురు రైతులు ఒక జర్నలిస్టు చనిపోయారని గుర్తు చేశారు. అయినా అతన్ని అరెస్టు చేయకపోవడం సిగ్గుచేట న్నారు. కార్యక్రమంలో నాయకులు బి.నాగేశ్వరరావు, రామయ్య, భూలక్ష్మి, వెంకటకృష్ణ, కె.చెన్నయ్య, అనిల్, వెంకటేశ్వర్లు, సైదా, లక్ష్మయ్య పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయ కులు ఎన్.రామసుబ్బాయమ్మ, బి.శంకర రావు, ఎస్.లూథర్, ఎస్.బాబు, రాజశేఖర్, టి.ప్రతాప్‌రెడ్డి, ఎం.విల్సన్, టి.బాబురావు, షేక్ సుభాని, లలితకుమారి, శివ, బి.భగత్‌సింగ్, ఎ.రామకృష్ణ, యోగయ్య పాల్గొన్నారు. మండల కేంద్రమైన నకరికల్లులోని పంచాయతి కార్యాలయం వద్ద నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వర్‌రెడ్డి, పిడిఎం జిల్లా నాయకులు మస్తాన్‌వలి, గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జి.బాల మాట్లాడారు. వివిధ సంఘాల నాయకులు జి.చిన్ని, జి.పిచ్చా రావు, లాల, జి.ఏడుకొండలు, జి.కుమారి పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. నాయకులు సురేష్ రాజా, శివరామకృష్ణ, కె.హనుమంతరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, బి.కోటయ్య, మునివెంకటే శ్వర్లు, నాసర్‌బి, సత్యనారాయణ పాల్గొన్నారు. మాచర్ల బస్టాండ్ సెంటర్‌లో నిరసన తెలిపారు. సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. ఆంజనే యులు నాయక్ మాట్లాడుతూ శాంతి యుత ప్రద్శన చేస్తున్న వారిపై వాహనాన్ని నడిపి నలుగురు మృతికి కారణమైన రోజునే బ్లాక్ డేగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాయకులు బి.మహేష్, వెంకటరత్నం, వి.వెంకట్రావు పాల్గొన్నారు. ముప్పాళ్ల మండలంలోని మాదలలో సిపిఎం ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహిం చారు. మండల కార్యదర్శి జి.బాలకృష్ణ మాట్లాడారు. నాయకులు కె.సాంబశివ రావు, ఎం.వెంకటరెడ్డి, జి.జాలయ్య, పి.సైదాఖాన్, కె.నాగేశ్వరరావు, టి.బ్రహ్మ య్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండల కేంద్రమైన రొంపిచర్లలో బ్లాక్ డే నిర్వహిం చారు. స్థానిక చెరువు కట్ట సెంటర్ నుంచి ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు మాట్లాడారు. వివిధ సంఘాల నాయకులు బి.నాగేశ్వ రరావు, ఎస్.వెంకటేశ్వరరాజు, పాపారావు, యాకోబు, ఐ.కోటేశ్వరరావు పాల్గొన్నారు.










