Oct 30,2023 21:55

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రైతులు అధైర్యపడొద్దని తాము అండగా ఉండి ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే రేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భరోసానిచ్చారు. సోమవారం మండల పరిధిలోని పోతుల నాగేపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో వర్షాభావంతో ఎండిన వేరుశనగ, కంది పంటపొలాలను పరిశీలించారు. వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవక పోవడంతో వేరుశనగ పంట ఎండిపోయిందని, పశువులకు మేత ఉండాలని తొలగిస్తున్నామని చెప్పారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందిస్తూ పంటనష్టానికి సంబందించిన సమగ్ర నివేదికను సత్వరం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టం నివేదికను అధికారులు పూర్తి చేసిన తర్వాత రైతులకు న్యాయం జరిగేలాగా పరిహారం వీలైనంత ఎక్కువ అందించేందుకు సిఎం జగన్మోహన్‌రెడ్డితో చర్చిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ రావులచెరువు ప్రతాప్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ పోతుకుంట రామయ్య, మండల వ్యవసాయ సంఘం అధ్యక్షులు మాలగుండ్లపల్లి కేశవరెడ్డి, నాయకులు వెంకటరామిరెడ్డి, పోతిరెడ్డి, రవీంద్రారెడ్డి.శివారెడ్డి, నర్సిరెడ్డి, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.