Oct 18,2023 21:14

పంట పొలాలను పరిశీలిస్తున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణి

        బుక్కరాయసముద్రం : ఖరీఫ్‌లో పంటలు సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణి డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని దండువారిపల్లి పంచాయతీలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు లక్షలు పెట్టుబడి పంటలు సాగు చేస్తే వర్షాభావ పరిస్థితిలతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం తలెత్తిందన్నారు. కావున ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ, తలారి రంగయ్య, బంగి నాగేంద్ర, పెద్దప్ప, ఎంపీటీసీ కొరపాడు ఆదినారాయణ, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.