Oct 02,2023 00:41

పల్నాడు జిల్లా: గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, రైతులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కేతిముక్కల అగ్రహారంలో 410 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్క- భూరక్ష (రీ-సర్వే) పత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ-రీసర్వేలో భాగంగా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి నంబర్‌ ఇచ్చేందుకు పత్రాలు పంపిణీ చేశామన్నారు.
రాష్ట్రంలో భూ వివాదాలన్నింటికి చెక్‌ పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని , భూమి కలిగిన ప్రతీ ఒక్కరికీ శాశ్వత హక్కుదారు ఇచ్చేలా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. హద్దు రాళ్లు పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని పరిస్థితులు మార్చాలని ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శాతం నుంచి 90 శాతం సివిల్‌ కేసులు భూములకు సంబంధించినవే ఉన్నాయని, రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్‌ సరిగా లేకపోవ డం వల్ల సమస్యలు ఎదురవు తున్నట్లు చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ మాటా ్లడుతూ అత్యాధునిక సర్వే సాం కేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేను చేస్తున్నట్లు చెప్పారు. భూహక్కు పత్రం అందించడం ద్వారా భూ యజ మానులకు హక్కు భద్రత కల్పిం చడం, 5 సెంమీ లేదా అంత కంటే తక్కువ కచ్చితత్వంతో జియో-రిఫరెన్స్‌ కోఆర్డినేేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలని అన్నారు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూవివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూకమత పటం భూ యజమానులకు జారీ చేస్తామని తెలిపారు.
సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ చేసే దిశగా భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభతరమవు తాయని అన్నారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు ఇవ్వడంతో పాటుగా, డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు ఇక చెక్‌ పెడతామని చెప్పారు. సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగ స్వామ్యం చేయడం, మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తామని నరసరావుపేట ఆర్టీవో ఎం.శేషిరెడ్డి అన్నారు. అధికారులు స్థానిక నాయకులు, రైతులు అందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమైందన్నారు. అనంతరం కేతముక్కల అగ్రహారం సర్వేయర్‌, విఆర్‌ఒ లను జాయింట్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమణ నాయక్‌,జడ్పిటిసి పి.చిట్టిబాబు,ఎంపిపి మూర బోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.