Oct 19,2023 23:24

మంగళగిరి: మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో గురువారం సంఘం పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 24 మంది రైతులకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆళ్ళ రామకష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై రైతులకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక సహకార సంఘం తొలి విడతడి రైతులకు రెండు కోట్లు, రెండో విడతగా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల రుణాలు పంపిణీ చేసిం దన్నారు. రైతులు పంట పండించుకునే సమయంలో అవసరాలకు తీసుకునే రుణాలను, పంట పండిన తర్వాత తిరిగి చెల్లించినట్లయితే, తర్వాత పంటకు ఎక్కువ రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. రుణాలను సంపూర్ణంగా వినియోగించుకొని రైతులు అభివద్ధి చెం దుతూ, సహకార సంఘం పరపతిని కూడా పెంచడానికి కృషిి చేయాలన్నారు. రైతులకు అండగా ఉంటున్న చైర్మన్‌, పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినం దించారు. కార్యక్రమంలో సంఘం చైర్మన్‌ ఎ.బ్రహ్మయ్య యాదవ్‌, సభ్యులు ఎస్‌.సుబ్బారావు, కె.మరియదాసు, మంగళగిరి జిడిసిసి బ్యాంక్‌ మేనేజర్‌ చినఖాసిం, సొసైటీ కార్యదర్శి ఆర్‌.రమేష్‌, వైసిపి నాయకులు ఎం.మల్లే శ్వరరావు, ఆకురాతి రాజేష్‌, ఎ.రామకృష్ణారెడ్డి, ఎండి ఫిరోజ్‌, కె.రాంబాబు, బి.నరసయ్య పాల్గొన్నారు.
వాకర్స్‌ ఛార్జీల మినహాయింపునకు వినతి
ఎకో పార్కు లో వాకింగ్‌ చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫీజులను వాకర్స్‌ అసో సియేషన్‌ సభ్యులకు మినహాయించాలని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే ఆర్కే గురువారం ఉదయం ఎకో పార్కును సందర్శించిన సందర్భంగా వారు ఆయనను కలిశారు. ఉదయం 8 గంటల లోపు వాకింగ్‌ చేసే వారికి చార్జీలు మినహాయించాలని, ట్రెక్కింగ్‌కు వచ్చే వారి నుండి ఛార్జీలు వసూలు చేయవచ్చునని వారు కోరారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడ అంద రికీ అనుకూలమైన ప్రకటన వచ్చేలా చర్యలు తీసు కుంటానని ఎమ్మెల్యే చెప్పారు.