వ్యవసాయ పరికరాలు అందజేస్తున్న స్వాతి తదితరులు
ప్రజాశక్తి - రంపచోడవరం
రంపచోడవరం మన్యం కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఆర్‌ఎస్ స్వేచ్ఛ సొసైటీ చైర్‌పర్సన్ కంటా స్వాతి చేతుల మీదుగా గురువారం వ్యవసాయ పరికరాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. రైతులు వ్యవసాయ పరికరాలు కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో మన్యం సొసైటీ ద్వారా ఇచ్చే పథకాలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఉదరు శ్రీనివాస్, మగేశ్వరరావు, శ్రీను, అనూష, లోవ, అరుణ లింగరాజు, రాజు పాల్గొన్నారు.a










