ప్రజాశక్తి- కశింకోట: మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన విత్తనాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. జెడ్పిటిసి శ్రీధర్ రాజు, ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నయ్యనాయుడు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతిశ్రీనివాస్, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, సర్పంచ్ మంత్రి రజిని, అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషోర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మునగపాక రూరల్ : మండలంలోని తోటాడ గ్రామ సచివాలయంలో సబ్సిడీపై విత్తనాలను స్థానిక సర్పంచ్ దొడ్డి మంగవేణి పంపిణీ చేశారు. ఎంపీటీసీ కాండ్రేగుల వెంకటలక్ష్మి, వైసిపి నాయకులు దొడ్డి కోటేశ్వరరావు, సచివాలయ సెక్రటరీ కాండ్రేగుల లక్ష్మీ నారాయణ, వార్డు సభ్యుడు బుద్ధ రమేష్ నాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ: ఖరీఫ్ సీజన్ మొదలవడంతో రైతులకు సకాలంలోనే విత్తనాలు ప్రభుత్వం అందచేయడంతో వ్యవసాయం చేసుకుందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని జడ్పిటిసి సుర్ల వెంకటగిరి గిరిబాబు, వైస్ ఎంపీపీ జక్కు నాగమణి తెలిపారు. చీడిగుమ్మల, గొలుగొండ, జోగంపేట తదితర గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం వద్ద రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎంపిటిసి సత్యనారాయణ, వైసీపీ మండల అధికార ప్రతినిధి జక్కు అప్పలస్వామి నాయుడు, వ్యవసాయ అధికారిని సత్యవేణ,ి జువ్వలదేవుడు పాల్గొన్నారు.
మాడుగుల:మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో బుధవారం సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు. సాంబ మసూరి, సొన మాసూరి, స్వర్ణ మసురి, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు వంటి వంగడాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, ఎంపిటిసి విజయలక్ష్మి, వార్డు సభ్యులు మహేశ్వరి, ఆర్‌బికే అధ్యక్షులు శ్రీదర్, వ్యవసాయ అధికారి వాసుదేవరావు, సిబ్బంది సత్యనారాయణ, జ్యోతి, రేణుక పాల్గొన్నారు.










