Jun 01,2023 23:25

విత్తనాలు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌

ప్రజాశక్తి -హుకుంపేట:ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వరి విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సీదరి సాంబ కోరారు. మండలంలోని మట్టుజోరు పంచాయతీ నక్కల తాడేపుట్టు రంగపల్లి, దబ్బబంధ, పెట్టుగోడలీ, కుంతుర్ల, నక్కలపుట్టు తదితర గ్రామాలకు చెందిన సుమారు 56 మంది రైతులకు విత్తనాలను గురువారం పంపిణీ చేశారు. సర్పంచ్‌ సాంబ మాట్లాడుతూ, జూన్‌ నెలల నుంచి వ్యవసాయ సీజన్‌ కావడంతో ప్రభుత్వం గుర్తించి ముందుగానే పంపిణీ చేస్తుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ దీప, మోహన్‌రావు, రైతులు పాల్గొన్నారు.