May 30,2023 00:14

విత్తనాలు ఇస్తున్న ఎంపిపి

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:రైతులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ విత్తనాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీపీ బి.ఈశ్వరి సూచించారు. సబ్సిడీ వరి విత్తనాలను మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం రైతులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సబ్సిడీ విత్తనాలు మండల వ్యాప్తంగా 16 గ్రామ సచివాలయ రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయం సాగు చేస్తున్న అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఈ సబ్సిడీ విత్తనాలను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సిహెచ్‌ జానకమ్మ, మండల వ్యవసాయ అధికారిని నీలవేణి, సర్పంచ్‌ వి.వెంకట్రావు, ఉపసర్పంచ్‌ జగ్గు నాయుడు, వైసిపి మండల నాయకుడు బి.సింహాచలం, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.