విత్తనాలు అందజేస్తున్న ఎంపిటిసి, సర్పంచ్
ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని చినమట్టపల్లి గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సడీ విత్తనాలు శుక్రవారం పంపిణీ చేశారు. పెసలు, మినుములు 4 కేజీల ప్యాకెట్ రూ.53కు అందించారు. చిన్నమటపల్లి ఎంపీటీసీ ప్రదీప్ కుమార్, సర్పంచ్ పిట్ట రామారావు, ఆర్‌బికె చైర్మన్ జయరాజ్, వ్యవసాయ శాఖ అధికారి రవి చేతుల మీదుగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్సిడీలో వచ్చే విత్తనాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, రైతులు, గ్రామ పటేలు సోడి తమయ్య, మోటుం భీమయ్య, పండా వెంకటేష్ పాల్గొన్నారు.










