విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎంపిపి లక్ష్మి తదితరులు
ప్రజాశక్తి -విఆర్.పురం
మండల కేంద్రం రేఖపల్లి వ్యవసాయశాఖ కార్యాలయంలో బుధవారం రైతులకు విత్తనాలను ఎంపీపీ కారం లక్ష్మి, రేఖపల్లి సర్పంచి పూనెం సరోజిని, ఎంపిటిసి బంధం విజయలక్ష్మి, వైస్ ఎంపిపి భవాని తదితరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రఘుకుమార్ మాట్లాడుతూ 90 శాతం రాయితీపై విత్తనాలు సరపరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, వైసిపి నాయకులు ముత్యాగౌతమ్, రైతులు పాల్గొన్నారు.










