ప్రజాశక్తి - బుట్టాయగూడెం
మండలంలోని రైతులకు జలకళ పథకంలో మంజూరైన విద్యుత్ మోటార్లను పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద మంగళవారం అందజేశారు. సుమారు రూ.80 లక్షల విలువైన మోట్లార్లను రైతులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సిఎం జగన్ ప్రాధాన్యతిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం శాంతి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, వైస్‌ఎంపిపి గుగ్గులోతు మోహన్‌రావు, సొసైటీ అధ్యక్షులు అరేటి సత్యనారాయణ, స్థానిక సర్పంచి తెల్లం వెంకాయమ్మ, సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.










