Dec 24,2022 23:24

వేరుశనగ విత్తనాలు పంపిణీ వ్యవసాయాధికారులు

ప్రజాశక్తి-సబ్బవరం : మండలంలోని బంగారంపాలెం రైతు భరోసా కేంద్రంలో 65 మంది రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఏపీ సీడ్స్‌ ద్వారా తెప్పించి రైతులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. విత్తనాలు నాటిన వెంటనే చీడ పీడల నుంచి సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దాడి లావణ్య కన్నం నాయుడు, మండల వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్‌ సూరిశెట్టి పార్వతి రాము, దొడ్డి వెంకటరమణ, కోరుబిల్లి నూకరాజు, దొడ్డి కన్నం నాయుడు, దాడి శ్రీను, దొడ్డి సోమేశ్వరరావు, సెక్రటరీ మౌనిక, సత్యనారాయణ, విఎఎ ప్రభావతి రైతులు పాల్గొన్నారు.