ప్రజాశక్తి - సీతంపేట : ఉపాధిహామీ పనులు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని టిడిపి నాయకులు పడాల భూదేవి అన్నారు. శుక్రవారం దేవనాపురం పరిధిలో గల సాగునీటి కాలువ పూడికతో నిండిన కారణంగా నీరు సాగునీరందడంలేదు. దీంతో ఆయకట్టు రైతులంతా శ్రమదానంగా పూడికతీత పనులు చేపట్టడాన్ని పరిశీలించిన భూదేవి రైతులతో మాట్లాడారు. వెంటనే ఉపాధి హామీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా పనులు మంజూరైనా మస్తరు సీటు రావకపోవడం వల్ల పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. అయితే రైతులకు ఉపయోగపడేలా పనులు చేయాలని, జూన్‌లో చేయాల్సిన పనులు ఇప్పటికీ చేయకపోవడం అధికారయంత్రం లోపమని విమర్శించారు. పాలకుల మాటలు నీటిమూటలే అన్న చందంగా ఉందన్నారు. కాలువ పనులు చేస్తుండగా సవర సుంభరు అనే రైతు పాముకాటు కు గురయ్యాడని గుర్తు చేశారు. వర్షకాలం కావడంతో కాలువలో గడ్డి, తుప్పలతో నిండిపోవడంతో పాములు చేరాయని, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరారు. ఆమె రైతులు సవర నర్రయ్య, బోగేష్, తోటయ్య, బంగారు, తదితరులు ఉన్నారు.










