ప్రజాశక్తి - ముసునూరు
పంట భూముల్లో రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల భూసారం తగ్గి రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ డైరెక్టర్ నాగదేశి రవికుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి ఎస్.మధుమోహన్ ఆధ్వర్యంలో జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం వారితో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న షెడ్యుల్డ్ కులాల రైతులకు నవధాన విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ డైరెక్టర్ నాగదేశి రవికుమార్, జెడ్‌పిటిసి సభ్యులు డాక్టరేట్ ప్రతాప్, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి, హిష్టరీ డైరెక్టర్ పి.స్వరూపరాణి ఆధ్వర్యంలో ఉచిత నవధాన్య విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.రాణి, కోర్లగుంట ఎంపిటిసి సభ్యులు సుందరరావు, సర్పంచులు చలసాని దామోదరరావు, కంచర్ల వాణి, జోనల్ కో-ఆర్గనేటర్ ఆగస్టన్, జిల్లా కో-ఆర్డినేటర్ సిహెచ్.సుబ్బరాజు పాల్గొన్నారు.










