Nov 06,2023 00:32

సమావేశంలో మాట్లాడుతున్న అలెగ్జాండర్‌ సుధాకర్‌

పల్నాడు జిల్లా: వర్షాలు లేక, సాగు నీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదు కోవాలని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక పల్నాడు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిసిసి పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్‌ సుధాకర్‌ అధ్యక్షత వహిం చారు. మస్తాన్‌వలి ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్ర ప్రదేశ్‌ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసం గించారు. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతాంగ సమస్యలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. నాగార్జున సాగర్‌ అయకట్టులో పెట్టుబ డులు పెట్టి,న రైతులు, కాల్వల్లో నీళ్లు రాక, వర్షాలు లేక బోర్లు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 101 మండలాలు మాత్రమే కరువుతో అల్లాడిపోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు చేశారు. ప్రకటించారన్నారు. అలెగ్జాండర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ రైతు పక్షపాతి ప్రభుత్వం వైసిపి అంటూ ఓవైపు ప్రచారం చేసు కుంటూనే రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధరలు కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమని గతంలో నిరూపితమైందని అన్నారు. సమావేవంలో రాష్ట్ర సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ యలమందారెడ్డి ,ఏపీపీసీసీ జన రల్‌ సెక్రటరీ రాదాకష్ణ, జిల్లా నాయకులు ఎస్‌ ఎమ్‌ బాషా, సీదాకృష్ణ, నాగేంద్ర, దార్లరాజు,గురజాల నాయకులు వేములు శ్రీను ,నరసింహారావు, జర్నలిస్ట్‌ లలితకుమారి, బీసీ సెల్‌ పూర్ణ, చిలకలూరిపేట నాయకులు ప్రసన్న గోవిందు శంకర్‌ ,అనిల్‌ మాజీ కౌన్సిలర్‌ కరీమూన్‌, భవాని వెంకటేష్‌, సత్యం ,రవి కిషోర్‌,ప్రేమ్‌,భరత్‌ కాల్విన్‌,కొండ పాల్గొన్నారు.