Nov 13,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌

రైతులకు సాగునీరు అందించండి..
ప్రజాశక్తి-విడవలూరు : జిల్లాలో మొదటి పంట వరిసాగు చేసే రైతులకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సిఐటియు నాయకులతో రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సోమశిల, కండలేరు జలాశాయలు, మిగిలిన ప్రాజెక్టులలో దాదాపు 45 టిఎంసిలు నీరున్నా అధికారులు క్రాప్‌ హాలిడే ప్రకటించినట్లు నీరు ఇవ్వలేమని చెప్పడం దారుణమన్నారు.
గతంలో 26 టిఎంసిలతో మూడు లక్షల ఎకరాలు పండించిన ఘనత నెల్లూరు జిల్లాకు ఉందన్నారు. రాజకీయాలకతీతంగా సీనియర్‌ రైతులు విశ్లేషణతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో తుఫాను హెచ్చరికలు సైతం జారీ చేయగా కొంత నీరు తోడు అవుతుందన్నారు. మొదటి పంటకు నీరు ఇవ్వలేకపోతే ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. జరగబోవు ఐఎబి సమావేశంలో వీటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకొని రైతులకు సాగునీరు అందించాలన్నారు. కార్యక్రమంలో అంకయ్య, సుబ్బయ్య, పాపయ్య, సిఐటియు, సిపిఎం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.