ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని వేంపాడు పిఎసిఎస్‌లో శుక్రవారం పిఎసిఎస్ పర్సన్ ఇన్ చార్జ్ సూరకాసుల రామలక్ష్మి, గోవింద్ అధ్యక్షతన సొసైటీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. రైతు రుణాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే, కొత్తగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి, సొసైటీ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు రాకాతి జగ్గారావుకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. కొత్తగా మంజూరు చేసిన వ్యవసాయ రుణాలను పలువురు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సత్యనారాయణ, అంజమ్మ, రైతులు కె.నాని,వి.కృష్ణ, జివి రమణ, వి.బాబ్జి, ఆర్.బాబురావు, ఆర్.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










