
పట్టాలు అందజేస్తున్న దృశ్యం
రైతులకు పట్టాలు పంపిణీ
ప్రజాశక్తి-సీతారామపురం:మండలంలోని పలువురు రైతులకు 2018లో సీజేఎఫ్ భూములను పట్టాలుగా అందించగా కొంతమందికి పట్టాల పంపిణీలో జాప్యం జరగగా ప్రస్తుతం పెండింగ్ సమస్యలు తొలగిపోయి రైతులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతులకు సంబంధించిన సీజేఎఫ్ భూములకు చెందిన పట్టాలను ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అందజేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పట్టాలను అందించారు. మండల ంలోని అయ్యవారిపల్లి 29, గంగవరం 78, గుండుపల్లి 29, చిన్ననాగంపల్లి 94, బసినేని పల్లి 216, సింగారెడ్డిపల్లి 37 మొత్తం 483 మంది రైతులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ ఎంవికె.సుధాకర్ బాబు, ఎంపీడీఓ రంగ సుబ్బరాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు.