ప్రజాశక్తి - పెద్దాపురం
తడిసిన ధాన్యం పంటను కొనాలని,రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు సోమవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్‌డిఒ జె సీతారామారావు కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు,రంది సత్యనారాయణ, తూతిక రాజు,కొత్తిం వెంకట శ్రీనివాసరావు(కోటి), నూనె రామారావు, కందుల విశ్వేశ్వరరావు, ఎలిశెట్టి నాని, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల : అకాల వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే ఏ నిబంధనలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు రైతు కాకినాడ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసా చార్యులు చౌదరి ఆధ్వర్యంలో సోమవారం సామర్లకోట మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ లక్ష్మీనరస కుమారికి రైతుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తోటకూర శ్రీనువాసు, పట్టణ టిడిపి అధ్యక్షులు అడబాల కుమారస్వామి, పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్, టిడిపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కంటే జగదీష్ మోహన్ (బాబు), టిడిపి కౌన్సిలర్ బలుసు వాసు, గుమ్మళ్ళ రామకష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), పార్టీ నాయకులు గొల్తి సత్యనారాయణ, కురుకూరి సోమేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.
పెద్దాపురం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ చిన్న రాజప్ప ఆధ్వర్యంలో ధర్నా










